Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం
- జిల్లా కేంద్రాలలో కార్యాలయ భవనాలు : మంత్రి జగదీశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫొటోగ్రాఫర్లకు బీమా వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తామనీ, సీఎం కేసీఆర్‌ను సంప్రదించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ నిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ శిల్పా కళావేదికలో తెలంగాణ ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్లీనరీ సమావేశాలు జరిగాయి.
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఫొటో గ్రాఫర్ల సంక్షేమ సంఘం కోరిన డిమాండ్లు సహేతుకమైనవే అయినప్పటికీ నిబంధనలనుసరించి ప్రాధాన్యాతా క్రమంలో తీర్చే ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. సంక్షేమ సంఘానికి జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలుండాలనే విజ్ఞప్తిపై ఆయన స్పందిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ఇది అమలు పెడతామన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో వచ్చిన మార్పులు లాభంతో పాటు నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందులో సెల్‌ఫోన్ రూపంలో మొదలు నష్ట పోయింది ఫొటోగ్రాఫర్లేనన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు యస్.వెంకట్ రెడ్డి, యస్కే హుస్సేన్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, మునగాల శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.