Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ కార్యదర్శికి పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ - హైదరాబాద్
కొత్త జిల్లాల్లో జెడ్పీజీపీఎఫ్ ఖాతాలను వెంటనే ప్రారంభించాలని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రభు త్వాన్ని కోరింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను మంగళ వారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి తొమ్మిది జిల్లా కేంద్రాల్లో జెడ్పీజీపీఎఫ్ ఖాతాలు కొనసాగుతున్నాయని వివరించారు. కొత్తగా ఏర్పాటైన 32 జిల్లాల వారీగా శాశ్వత ప్రాతిపదికన జీపీఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని కోరారు. 32 జిల్లాల్లో కొత్తగా జెడ్పీజీపీఎఫ్ ఖాతాలను ప్రారంభించాలంటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, సంబంధిత అధికారులను సుల్తానియా ఆదేశించారని తెలిపారు.
రెండు నెలల్లో పెండింగ్ బిల్లుల మంజూరు
రాబోయే మే, జూన్ రెండు నెలల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సుమారు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తామంటూ ఆర్థిక శాఖ అధికారులు హామీ ఇచ్చారని పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నారు.