Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి పెండింగ్ వేతనాలు, లాక్డౌన్ కాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హస్టళ్లలో సుమారు 3,070 మంది డైలీవేజ్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైమ్ తదితర పేర్లతో గత 35 ఏండ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ శాఖ పరిధిలో పనిచేస్తున్న దినసరి వేతన కార్మికులను (డైలీవేజ్ వర్కర్స్) పర్మినెంట్ చేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్య కనుగుణంగా పోస్టులను మంజూరు చేసి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పిస్తామని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, డైలీవేజ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. డైలీవేజ్, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ కోసం జీవో నెంబర్ 16ను 2016, ఫిబ్రవరి 26న ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ కూడా జీవో నెంబర్ 16 మార్గదర్శకాల ప్రకారం గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ 2017, ఏప్రిల్ 26న తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో 2017, సెప్టెంబర్ 15న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ మెమో నెంబర్ సి2/1846/2016 (సూచిక-3)ను ఇచ్చారని వివరించారు. 2016, ఫిబ్రవరి 26 నాటికి పదేండ్ల సర్వీస్ పూర్తిచేసిన వారి రెగ్యులరైజేషన్ కోసం వివరాలు అందించాలని కోరారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ సర్క్యులర్ అమలుకు నోచుకోలేదని తెలిపారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకను గుణంగా నూతన పోస్టులను మంజూరు చేయడం లేదని విమర్శించారు. దీంతో అవసరాన్ని బట్టి విద్యార్థుల సంఖ్యకనుగుణంగా డైలీవేజ్, ఔట్సోర్సింగ్ పేరుతో వర్కర్లను నియ మించుకుం టున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు.
బడ్జెట్ కేటాయింపుల్లేవ్
డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల సంఖ్యకనుగు ణంగా అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని జూలకంటి తెలిపారు. ఫలితంగా నెలలు, ఏండ్ల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొన్నారు. వారికి గత 35 ఏండ్లుగా జిల్లా కలెక్టర్ల గెజిట్ ప్రకారం వేతనాలను చెల్లిస్తు న్నారని వివరించారు. కానీ ఇటీవల కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గెజిట్లను అమలు చేయడం లేదని తెలిపారు. లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ పూర్తి వేతనం చెల్లించాలని జీఓ నెంబర్ 45ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ జీఓను అమలుచేసి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు రోజుకి 16 గంటలు శ్రమ చేస్తూ గిరిజన విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనాలు ఇవ్వటం లేదని పేర్కొన్నారు. జిల్లాకు ఓ రకంగా వేతనాలను చెల్లిస్తున్నారని తెలిపారు. అవికూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్‌టైమ్ పేరుతో తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం నిప్పుల దగ్గర వంట చేస్తూ అనారోగ్యాల పాలవుతున్నా పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించటం లేదని వివరించారు. సరైన జాబ్ చార్ట్ లేదని తెలిపారు. విపరీతమైన పనిభారం ఉంటున్నదని పేర్కొన్నారు. కావున గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని తెలిపారు. పెండింగ్, లాక్డౌన్ కాలంలో వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని జూలకంటి డిమాండ్ చేశారు.