Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మినీ గురుకులం కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన మినీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం బోధన, బోధనేతర సిబ్బందికి కనీస వేతనాలివ్వాలని గిరిజన మినీ గురుకులం కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు.దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి బంజారా హిల్స్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గిరిజన మినిగురుకులం కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వి నిర్మల మాట్లాడుతూ రాష్ట్రంలో 29 గిరిజన రెసిడెన్షియల్ మినీ గురుకులం(బాలికల) పాఠశాలలున్నాయనీ, అవి 1999-2000 సంవత్సరంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది తక్కువ వేతనంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. బీఈడీ, టీటీసీి, టెట్లలో అర్హత పొంది ఎంతో మంది గిరిజన బాలికలను ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా తోడ్పాటు నందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్దమై ఉద్యోగాలు పొందే వీలు లేకుండా వయోపరిమితి దాటి పోయిందన్నారు.
2018 సంవత్సరం నుంచి ప్రభుత్వం మినీ గురకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నెలకు రూ. 15వేలు, బోధనేతర సిబ్బందికి రూ. 7,500, ఏఎన్ఎంలకు రూ. 9వేల చొప్పున వేతనం ఇస్తున్నదని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పోల్చుకుంటే ఆ వేతనంతో బతకటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోనెం 22 ప్రకారం అర్హత సీనియార్టీ ఆధారంగా తమను క్రమబద్దీకరించాలనీ, జీవిత ఆరోగ్య బీమా (హెల్త్ కార్డ్ ) సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో రజిని, సుశీల, శ్రీలత, నీల, సులోచన, ధృపదా, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.