Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యశ్రీ సీఈవోకు హరీశ్ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు రహిత వైద్య సేవలు (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం -ఈహెచ్ఎస్)పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించాలని ఆరోగ్యశ్రీ సీఈవో విశాలచ్చిని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. చర్చించిన అనంతరం 10 రోజుల్లో నివేదిక రూపొందించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన సమీక్షలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలనీ, వారానికి మూడు ఆస్పత్రులు సందర్శించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రోగులకు అందుతున్న సేవలను తెలుసుకోవాలని కోరారు.
సమాచారం అడిగితే వెంటనే ఇవ్వాలి
ఈ ఏడాది ప్రారంభించాలనుకుంటున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు గాను ఆరింటికి అనుమతులు రావడం పట్ల మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన మూడు కాలేజీల అనుమతుల కోసం ఎలాంటి సమాచారం అడిగినా వెంట వెంటనే సమర్పించాలని డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డిని మంత్రి ఆదేశించారు.