Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన మంత్రి వేముల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ఆలోచనల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులపై మంత్రి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. కార్యాలయ ఫర్నీచర్ పరిశీలించారు. కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని మంత్రి వారికి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఆర్కిటెక్ట్ ఆస్కార్, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.