Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆటలాడుతున్నదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్‌లీక్ ఘటనలో ప్రభుత్వ పెద్దల ప్రమేయముందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. నవంబర్‌లో కేసీఆర్ రిటైర్మెంట్ కాబోతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్‌ను మించినోళ్లు లేరన్నారు. టీఎస్పీఎస్సీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన అభ్యర్థులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ యాసలో మాట్లాడాను తప్ప తానెప్పుడూ బూతులు మాట్లడలేదనీ, భాషలో తనకు కేసీఆరే గురువని అన్నారు. ఏప్రిల్ 23న అమిత్ షా పార్లమెంట్ ప్రవాస్లో భాగంగా చేవెళ్లకు వస్తున్నారనీ, ఆరోజు అక్కడ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఈ ప్రెస్‌మీట్ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీలో చేరారు.