Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి :సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 353 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా కేవలం 2 మాత్రమే ప్రారంభించి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఒక గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారులి. 15 రోజుల క్రితం నుండే వరి కోతలు మొదలయ్యాయని, వడ్లను ఎక్కడ నిల్వ చేసుకోవాలో రైతులు అయోమయంలో ఉన్నారని తెలిపారు.