Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు,అన్నప్రాసన
నవ తెలంగాణ-రాయపోల్
గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని అనాజీపూర్ గ్రామ సర్పంచ్ ఎనుముల శోభారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ డెబోరా రాణి సూచించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం గర్భిణీ మహిళలందరికీ సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడంలో మొహమాట పడుతున్నారన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. బిడ్డకు పుట్టిన వెంటనే పట్టిన తల్లి పాలు మొదటి టీకాలుగా పని చేస్తాయన్నారు. శిశు మరణాలు తగ్గించాలంటే తప్పనిసరిగా పిల్లలకు తల్లిపాలు అందించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీమన్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్, అంగన్వాడీ టీచర్లు పద్మ, మంజుల, సరస్వతి, రాధ, ఉపాధ్యాయులు, ఆయమ్మలు తదితరులు పాల్గొన్నారు.