Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న మంత్రి కేటీఆర్ :ఘనంగా ఏర్పాటు చేయాలని
అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహబూబ్ నగర్‌లోని దివిటీపల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్‌ను మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారని, ఐటీ టవర్ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఐటీ టవర్ ప్రారంభోత్సవం పై టీఎస్ఐఐసీ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బెంగుళూరు హైవే నుంచి ఐటీ టవర్‌కు 100అడుగుల నూతన కనెక్టింగ్ రోడ్డుకు అనుసం ధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా పెద్ద ముఖద్వారాన్ని నిర్మించాలని టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు. ఐటి టవర్ నుంచి మహబూబ్‌నగ ర్ పట్టణానికి కనెక్టింగ్ రోడ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. టవర్ నుంచి మహబూబ్‌నగర్ పట్టణానికి అధునాతన రోడ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో టీిఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ డి.రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రముఖ కన్సల్టెంట్ రాజ్‌కుమార్, నిర్మాణ సంస్థ గుత్తేదారులు నరసింహ, రాజశేఖర్‌రెడ్డి, అమరరాజా సంస్థ ప్రతినిధులు మసూద్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.