Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్రమణలో సౌదీలోని నిజాం సత్రం
- రంజాన్ తర్వాత చర్యలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హజ్ యాత్రీకులు, ఖాదీమ్ల ఎంపికను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు హజ్ కమిటీ చైర్మెన్ మహ్మద్ సలీం తెలిపారు. బుధవారంనాడిక్కడి హజ్ భవన్లో సౌదీకి వెళ్లే ఖాదీమ్ల ఎంపిక కోసం డ్రా నిర్వహించారు. దీనికోసం 165 దరఖాస్తులు రాగా, దానిలో 111 మంది అర్హత సాధించారనీ, వారిలో డ్రా పద్ధతిలో 15 మందిని, వెయిటింగ్ లిస్ట్ కింద మరో ఐదుగురిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది హజ్ యాత్రకు 5,278 మంది ఎంపిక అయ్యారనీ, వారికి తగిన శిక్షణ ఇచ్చి జూన్ 6వ తేదీ ప్రత్యేక చార్టెడ్ విమానాల ద్వారా సౌదీకి పంపుతామని వివరించారు. సౌదీలోని నిజాం సర్కార్ నిర్మించిన సత్రం కొందరి కబ్జాలో ఉన్నదనీ, దాన్ని విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ మేరకు తానే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసానన్నారు. రంజాన్ తర్వాత సౌదీ ఎంబసీతో పాటు అక్కడి పోలీస్‌శాఖకు కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సమావేశంలో హజ్ కమిటీ సీఈఓ షఫియుల్లా తదితరులు పాల్గొన్నారు.