Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహదేవపూర్‌లో 44.5 డిగ్రీల ఎండ
- అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
- పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షంపడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓవైపు కొలిమిలా ఎండ..మరోవైపు తీవ్ర ఉక్కపోతతో ప్రజలుఅల్లాడిపోతున్నారు. చాలా జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అయితే, వచ్చే నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలి పారు. రాష్ట్రం మీదుగా దక్షిణ, ఆగేయ దిశల నుంచి కింది స్థాయి లో గాలులు వీస్తున్నాయని చెప్పా రు. ఆదిలాబాద్, కొమ్రంభీం అసి ఫాబాద్, మంచిర్యాల, నిజామా బాద్, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 48 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
మహదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) 44.5 డిగ్రీలు
మల్లాపూర్ (జగిత్యాల) 44.5 డిగ్రీలు
తాళ్లమడుగు(ఆదిలాబాద్) 44.3 డిగ్రీలు
రాయినిగూడెం(సూర్యాపేట) 44.2 డిగ్రీలు
వెల్గటూరు(జగిత్యాల) 44.2 డిగ్రీలు
గరిమెళ్లపాడు(భద్రాద్రి కొత్తగూడెం) 44.0 డిగ్రీలు
తాడ్వాయి (ములుగు) 44.0 డిగ్రీలు
కొల్లాపూర్(నాగర్‌కర్నూల్) 44.0 డిగ్రీలు
అర్లి(టి)(ఆదిలాబాద్) 44.0 డిగ్రీలు