Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు టిమ్స్ ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి
- ఎనిమిది టీచింగ్ ఆస్పత్రుల పనులు పూర్తి చేయాలి
- ఈ ఏడాది ప్రారంభ మయ్యే 9 మెడికల్ కాలేజీల డిజైన్లను రూపొందించాలి :ఆర్ అండ్ బీ అధికారులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా నాటికి వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణం పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రోడ్లు, భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రు లు, మెడికల్ కాలేజీల పనుల పురో గతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మూడు టిమ్స్ ఆస్పత్రుల పనుల్లో వేగం పెంచాలనీ, ఎనిమిది బోధనా స్పత్రుల పనులు పూర్తి చేయాలనీ, ఈ ఏడాది ప్రారంభమయ్యే తొమ్మిది మెడికల్ కాలేజీల డిజైన్లను రూపొం దించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యాధునిక మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజరు కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, అరోగ్యశ్రీ సీఈవో విషాలాచ్చి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ సీఇ రాజేందర్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప పాల్గొన్నారు.