Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మోడల్‌ను వివరించే వాల్ పోస్టర్లు
- ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రచార రథాలు కదిలాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 24న తేదీన ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్)లోని జబిందా మైదానంలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతానికి పెద్ద ఎత్తున చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ప్రచార రథాలను గురువారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ అభివద్ధి, సంక్షేమ పథకాల సమాహారం, తెలంగాణ మోడల్‌ను వివరించే వాల్ పోస్టర్లను టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి ఆవిష్కరించారు.