Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు చోట్ల భారీ బహిరంగ సభ : మహేష్‌కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఐదు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గురువారం ఈమేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ ప్రకటించారు.
ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, 28న నల్లగొండ, 30న మహబూబ్‌నగర్, మే 1న రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహిస్తామని ఆయన తెలి పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు ఆయా కాంగ్రెస్ జిల్లా కమిటీలు బాధ్యత తీసు కుని బహిరంగ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి
మే మొదటివారంలో కాంగ్రెస్ నిర్వహించ నున్న నిరుద్యోగ నిరసన సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చెప్పారు. అదే సభ లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
రాహుల్‌కు హైకోర్టులో న్యాయం జరుగుతుంది :మల్లు రవి
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి హైకోర్టులో న్యాయం జరుగుతుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు.