Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 49 శాతం పీఆర్సీ ప్రకటించాలి
- సీఎంకు టీజేఎంయూ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులు అప్పుల పాలవుతున్నారనీ, అందువల్ల పీఆర్సీకి సంబంధించి సీఎం వారికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీజేఎంయూ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్ గురువారం ఒక ప్రకటనలో సీఎంకు విజ్ఞప్తి చేశారు. కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేతన సవరణలు ఇవ్వాలని తెలిపారు. 2017 వేతన సవరణకు ముందుగానే 16 శాతం ఐఆర్ ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా 33శాతం ఫిట్ మెంట్తో పీఆర్సీ ప్రకటించి మొత్తం 49 శాతం ప్రకటించి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. రెండో వేతన సవరణ 2021ను కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏండ్ల నుంచి కార్మికులకు జీతాలు పెంచలేదని, తక్కువ జీతాలతో భారంగా కుటుంబాన్ని పోషిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పుల బాధతో చనిపోతున్నారని గుర్తుచేశారు.