Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ బదిలీలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల పేరుతో కాలయాపన చేయడం వల్ల టీఆర్టీ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమైందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్టీపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నాలుగు లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. బదిలీల కేసు హైకోర్టు మళ్లీ జూన్ 13వ తేదీకి వాయిదా వేసిందని తెలిపారు. దీంతో ఇప్పట్లో ఈ ప్రక్రియ ముగియదని, అందుకే టీఆర్టీకి బదిలీల ప్రక్రియను ముడి పెట్టకుండా తక్షణమే 15 వేల ఉపాధ్యాయ ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని కోరారు. త్వరగా టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.