Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని
హైదరాబాద్: ఆరోగ్యానికి శారీరక శ్రమ అవసరమని, అందుకు జలక్రీడలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ స్విమ్మింగ్ పూల్ ను ఆయనప్రారంభోత్సవం చేశారు. వేసవి కాలంలో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రావటం సంతోషంగా ఉన్నదని వివరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ స్విమ్మింగ్ పూల్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జి సురేష్, చిరంజీవి, ప్రభాకర్చారి తదితరులు పాల్గొన్నారు.