Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ టెక్నలాజీ సొల్యూషన్స్ కంపెనీ సైయంట్ లిమిటెడ్ 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.16 లేదా 320 శాతం తుది డివిడెండ్‌ను అందించడానికి ప్రతిపాదిం చింది. దీనికి ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. రెండవ సారి ఇండిపిండెంట్ డైరెక్టర్‌గా రమేస్ అభిశేక్‌ను కొనసాగించడానికి గ్రీన్ సిగల్ ఇచ్చారు. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు ఏడాదికేడాదితో పోల్చితే 5.83 శాతం పెరిగి రూ.163.20 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.154 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1,181 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన త్రైమాసికంలో రూ.1,751.40 కోట్లకు పెరిగింది. శాతం పెరిగి రూ.1,448.9 కోట్లకు చేరింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా విభిన్న రంగాల్లోని 300 పైగా ఖాతాదారులు ఉన్నారు.