Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతల ఆందోళన
నవతెలంగాణ-చింతకాని
రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన బాట పట్టారు. రోజురోజుకీ మొక్కజొన్న ధర భారీగా తగ్గుతుండడంతో.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని రైతన్నలు ఖమ్మం - బోనకల్ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి తోటకూరి వెంకట నరసయ్య మాట్లాడుతూ.. అకాల వర్షాలకు మొక్కజొన్న పంట భారీగా నష్టం వాటిల్లిందని, ప్రారంభంలో క్వింటాకు రూ.2300 పలికిన ధర ఇప్పుడు కేవలం రూ.1750 మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు రవి, కోలేటి నాగేశ్వరరావు, ఏటుకూరి రవి, అంబటి లచ్చయ్య, బైరు బ్రహ్మం, ఆలస్యం నాగేశ్వరరావు, లింగ బాబు, రామారావు, కోలేటి చిన్న బ్రహ్మయ్య, బైరు స్వామి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.