Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న హైదరాబాదులో రాష్ట్రస్థాయి ఉత్సవం: కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ హక్కులను రక్షించుకోవడానికి ఈ నెల15న ప్రారంభివంచిన ఫూలే, అంబేద్కర్ జన జాతరలను 30వరకు కొనసాగిస్తారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ తెలిపారు.గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవి రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్లీ మాట్లాడుతూ ఈ నెల 29న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాష్ట్ర స్థాయి ఫూలే, అంబేద్కర్ జనజాతరను వేలాది మందితో నిర్వహిస్తామని తెలిపారు.మనువాద పాలకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడమే ఈ జాతర్ల ఉద్దేశమని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేసి, దాని స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సర్కార్ కుట్రలు పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లకు సమాధి కడుతున్నదని విమర్శించారు. బీసీ కుల గణను ఎందుకు చేపట్టటం లేదని ప్రశ్నించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై 300 శాతం మేర దాడులు, దౌర్జన్యాలు, లైంగిక దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క మోడీ సర్కార్ పేదలపై విపరీతమైనభారాలు మోపుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ రక్షణ కోసం రాజకీయాలకతీతంగా ఐక్య ఉద్యమం చేపడుతామన్నారు. సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడసం భీమ్ రావు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ్మ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్జి జగదీష్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.