Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా పోరుయాత్ర ముగింపు సభలో తమ్మినేని, కూనంనేని
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మోడీని గద్దెదించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిపేందుకు సీపీఐ ఖమ్మం జిల్లా వ్యాప్తం గా నిర్వహించిన ప్రజా పోరుయాత్ర ముగింపు సభ ఖమ్మంరూరల్ మండలంలోని వరంగల్ క్రాస్రోడ్లో శుక్రవారం సీపీఐ ఖమ్మం రూరల్ మండల కమిటీ నాయకులు దండి సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక శక్తులతో చేతులు కలుపుతామన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుందని, కులాలు, మతాల పేరిట ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ తమ పబ్బం గడుపు కోవడమే బీజేపీ ధ్యేయమని తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగి స్తున్న ఘనత మోడీకే దక్కుతుందన్నారు. మును గోడులో బీజేపీని ఓడించేందుకే బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో ఎర్రజెండా లు ఐక్యతగా కేసీఆర్తో కలిసి పని చేస్తామన్నారు. సీపీఐ(ఎం), సీపీఐ బలంగా ఉన్నచోట్ల కచ్చితంగా సీట్లు అడుగుతామని, ఇప్పటివరకు ఎటువంటి సీట్ల ఒప్పందం జరగలేద న్నారు. కష్టజీవులకు ఎదురొస్తే, అంగన్ వాడీ, ఆశా, వీఆర్ఏ, కాంట్రాక్టు లెక్చరర్లు, గ్రామ పంచాయతీ ఉద్యోగుల విషయంలో కేసీఆర్ పైన పోరాడుతామని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు ఒక తల్లి బిడ్డలని, కుటుంబంలో చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నట్లే గ్రామాల్లో ఏమైనా విబేధాలు ఉంటే సరి చేసుకోవాలని సీపీఐ, సీపీఐ(ఎం) శ్రేణులకు సూచించారు. ఖమ్మం జిల్లాలో కమ్యూ నిస్టులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందులో రూరల్ మండలం నుంచే ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ.. దేశంలో దొంగలు పడ్డారని, ఆ దొంగలకు నాయకుడు మోడీనేనని అన్నారు. దేశవ్యాప్తంగా అధిక దొంగలున్న పార్టీ బీజేపీనే అన్నారు. కొంతమంది నాయకులు అప్పటి కమ్యూని స్టులు వేరు, ఇప్పటి కమ్యూనిస్టులు వేరని ప్రగల్బాలు పలుకుతున్నారని, కమ్యూనిస్టు పార్టీలను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వెళ్లి మేసేవారు కమ్యూనిస్టులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. పార్టీలు మారే సంస్కృతి కమ్యూనిస్టులకు లేదన్నారు. ఈ సభను ఇంత విజయవంతం చేసిన సీపీఐ శ్రేణులకు విప్లవ అభివందనాలు తెలిపారు. సందర్భంగా సీపీఐ శ్రేణులు తమ్మినేనిని శాలువాతో ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు మహమ్మద్ మౌలానా, పుచ్చ కాయల కమలాకర్ ప్రసంగించారు. సభలో సీపీఐ నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, పుచ్చకాయల సుధాకర్, యర్రా బాబు, సిద్దినేని కర్ణ కుమార్, సీపీఐ(ఎం) నాయకులు నండ్ర ప్రసాద్, షేక్ బషీరుద్దీన్, నవీన్ రెడ్డి, భూక్య నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.