Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్స్‌కో, జెన్కో చైర్మెన్‌కు టీఎస్‌యూఈఈయూ సమ్మెనోటీస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వ హిస్తున్న ఆర్టిజన్స్, ఆన్మెన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మే 5 నుంచి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) తెలిపింది. శుక్రవారం ఈ మేరకు ట్రాన్స్‌కో, జన్కో చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె ఈశ్వర్రావు, జే ప్రసాద్‌రాజు సమ్మె నోటీస్ అందజేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో డిస్కమ్‌ల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను కన్వర్షన్ చేయాలని వారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను కోరారు. ఇదే అంశంపై యాజమాన్యాల్ని అనేక సార్లు కోరామనీ, వినతిపత్రాలు సమర్పి ంచామని గుర్తు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జరిగిన వేతన ఒప్పందం సందర్భంగా వారిని కన్వర్షన్‌తోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ అమల్లోకి తెస్తారని ఎదురుచూసిన తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్స్, ఓ అండ్ ఎమ్ ఉద్యోగులు చేస్తున్న పనులనే ఆన్మెన్డ్ కార్మికులు చేస్తున్నారని తెలిపారు. వారికి సంస్థలో గుర్తింపే లేదని పేర్కొన్నారు. ఈ కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి సంస్థకు సేవలు చేస్తున్నారనీ, ఈ ఆన్మెన్డ్ కార్మికులందరినీ ఆర్టిజన్స్‌గా గుర్తించి వారికి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సంస్థను నమ్ముకుని 6500 మంది పీస్‌రేట్ కార్మికులు, రెవెన్యూ, క్యాషీయర్, స్పాట్ బిల్డర్స్‌తోపాటు ఇతర కార్మికులకు చాలా తక్కువ కమిషన్ వస్తుందనీ, ఆ కార్మికులకు కనీస వేతనాల జీవో నెంబర్ 11ను అమలు చేయాలని కోరారు. ట్రాన్స్, జెన్కో రెండు డిస్కంల్లో ఉన్న ఆర్టి జన్స్, పీస్‌రేట్ కార్మికులు, ఆన్మెన్డ్ కార్మికులతోపాటు ఈనెల 15న జరిగిన వేతన ఒప్పందంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. పారిశ్రామిక వివాదాలచట్టం 1947 సెక్షన్-22, సబ్‌సెక్షన్ (1) ప్రకారం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయమైన కోర్కెల సాధన కోసం మే5 నుంచిగానీ ఆ తర్వాతగానీ ఏ సమయంలోనైనా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు సమ్మెనోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు.
డిమాండ్లు
- ఆర్టిజన్స్‌ను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలి. ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. ఈ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగుల తో సమానంగా 'పేస్కేల్' ఇవ్వాలి. అన్ని రకాల సెలవులు వర్తింప జేయాలి. కాంట్రాక్ట్ సర్వీస్‌ను కలిపి గ్రాడ్యూటీ, సర్వీస్ వెయిటేజ్ ఇంక్రిమెంటు ఇవ్వాలి.
- ఆర్టిజన్స్ పీీఎఫ్పై సీలింగ్ తొలగించి బేసిక్ డీఏ మొత్తానికి పీిఎఫ్ షేర్ చెల్లించాలి. కార్మికులకు పాతపద్ధతి ప్రకారమే ఇంటి అద్దె అలవెన్స్ చెల్లించాలి.
- ఆర్టిజన్స్ కారుణ్య నియామకాల్లో అర్హతను బట్టి తగిన గ్రేడ్ ఉద్యోగం ఇవ్వాలి. మెడికల్‌గా అన్‌ఫిట్ ఉన్న కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
- ఆన్మెన్డ్ కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించాలి. స్కీల్డ్ వేతనం అమలు చేయాలి.
- పీస్‌రేట్ కార్మికులకు బిల్‌కలెక్టర్, స్పాట్బిల్డర్, ఏసీపీఎం, పీఏఏ స్టోర్ తదితర కార్మికులకు జీవోనెం 11 ప్రకారం కనీసవేతనాలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
- 4.12.2016 వరకు సర్వీస్‌లో ఉండి అన్ని అర్హతలువున్న కాంట్రాక్టు/ ఔట్సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించాలి.
- 2011 జూనియర్ లైన్మెన్లకు నియామక తేదీ నుంచి వేతన బకాయిలు చెల్లించాలి.
- కారుణ్య నియామకాలు పాత పద్ధతి ప్రకారం ఇవ్వాలి.
- హాట్‌లైన్లలో పని చేసే ఆర్టిజన్ కార్మికుల విద్యార్హతతో సంబంధం లేకు ండా గ్రేడ్-1 వేతనాలు చెల్లించాలి. (రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని)
- 33/11 కేవీ సబ్ స్టేషన్లలో నాలుగో ఆపరేటర్‌ను పెట్టాలి.