Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజాన్ శుభాకాంక్షల సందేశంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ఈ మేరకు సందేశాన్ని విడుదల చేశారు. ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో 'ఈద్ ఉల్ ఫితర్...' పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.