Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటామంటూ బిల్డప్ల మీద బిల్డప్లిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ అంశం నుంచి వెనక్కి తగ్గడమేంటని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆయన తీరుతో రాష్ట్ర పరువు పోయిందని తెలిపారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూతపడ్డ వందలాది పరిశ్రమలను తెరిపించాలని పేర్కొన్నారు. రోడ్డున పడ్డ లక్షలాది మంది కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.