Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రైవర్ సాధికారత పథకం గొప్ప వరం లాంటిదని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 78 మంది లబ్ది దారులకు ఆయన కార్లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ యువతకు అండగా నిలిచేలా ప్రభుత్వం డ్రైవర్ సాధికారత పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలి పారు. కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ క్రిస్టియన్లకు 60 శాతం సబ్సిడీతో కార్లను అందజేస్తున్నట్టు వివరించారు. లబ్ది దారులు వాటిని ట్రావెల్స్ గా, క్యాబ్ మాదిరిగా నడుపుకొంటారని తెలిపారు. ఇప్పటి వరకు 1831 లబ్దిదారులకు ఆర్ధిక సబ్సిడీ కింద రూ.20 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. డ్రైవర్ సాధికారత పథకం కింద 2016-17, 2018-19 సంవత్సరాల్లో కార్లు కొనుగోలు కోసం 154 మంది క్రైస్తవ మైనారిటీ లబ్దిదారులకు రూ. 6.90 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. తాజాగా క్రిస్టియన్ ఫైనాన్ కార్పొరేషన్ ద్వారా 78 మంది లబ్దిదా రులకు డ్రైవర్ సాధికారత పథకం క్రింద కార్లను అంద చేసినట్టు చెప్పారు.