Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలో వెల్లడి : సీపీ ఏవీ రంగనాధ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని, ఈ మేరకు ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికల్లో స్పష్టంగా ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాధ్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రీతి ఆత్మహత్యపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సవివరణ ఇచ్చారు. వారం, పది రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య చేసు కుందన్నారు. పాయిజన్ ఇంజక్షన్ తీసుకోవడం వల్లే చనిపోయిందని తెలిపారు. ప్రీతి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం విది తమే. ఇటీవలే ప్రధాన నిందితుడైన సైఫ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.