Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే నెల 15 నుంచి 31 వరకు సీఎం కప్ పేరిట క్రీడలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్డీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. జూన్2న విజేతలకు బహుమతులు అందజేయనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో క్రీడాప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్లు, స్టేడియాల అడ్మినేస్ట్రేటర్లు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడానికి సీఎం కప్ క్రీడలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.