Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటలకు రేవంత్ సవాల్
- మునుగోడు ఎన్నికలకు తమ పార్టీ నేతలే ఆర్థిక సాయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి రేవంత్‌రెడ్డి రూ 25 కోట్లు తాను తీసుకున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నుంచిగానీ, కేసీఆర్ నుంచిగానీ డబ్బు తీసుకున్నట్టు నిరుపిస్తావా? అని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ రాజకీయంగా దిగజారి మాట్లాడు తున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ నుంచి గానీ, కేసీఆర్ నుంచి సాయం పొందలేదని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి తమ కార్య కర్తలు ఇచ్చిన చందాలని అన్నారు. కాంగ్రెస్‌లోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని తెలిపారు. వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల మాట్లాడటం సమంజసం కాదన్నారు. బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముతారనీ, శనివారం సాయంత్రం 6 గంటలకు వాళ్లు నమ్మే భాగ్యలక్ష్మి టెంపుల్లో దేవుడిపై ఇదే విషయాన్ని ఒట్టేసి చెబు తానని సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణలను ఈటల నిరూపిం చేందుకు సిద్ధమా? అని ఈటలను ప్రశ్నించారు.' భాగ్యలక్ష్మి దేవుడిపై నమ్మకం లేకుంటే.. ఏ ఆలయంలో నైనా తడి బట్టలతో ప్రమాణానికి తాను సిద్ధం' అని రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్‌కు సవాల్ విసిరారు. బీజేపీలో చేరిన తర్వాత వ్యక్తిత్వం కోల్పోయి మాట్లాడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఒక ప్రకటనలో విమర్శించారు. ఆ పార్టీలో ఆయనకు విలువ లేకుండా పోవడంతో మతిస్థితం కోల్పోయి పిచ్చిలేసి ఏదేదో మాట్లా డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలకు ధైర్యం ఉంటే కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలను నిరూపించాలని కోరారు. లేకపోతే తాను తప్పుడు ఆరోపణలు చేశానంటూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.