Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చేనెల 21,22 తేదీల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాతపరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీఆర్టీ)తోపాటు నార్మలైజేషన్ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. గతేడాది సెప్టెంబర్ మూడో తేదీన 1,540 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేశామని పేర్కొన్నారు. జనవరి 22న నిర్వహించిన ఓఎంఆర్ ఆధారిత పరీక్షను రద్దు చేశామని తెలిపారు. వచ్చేనెల 21న ఓఎంఆర్ పద్ధతిలోనే మళ్లీ రాతపరీక్ష నిర్వహిసా ్తమంటూ గతనెల 29న ప్రకటించామని గుర్తు చేశారు. దీన్ని పరిశీలించిన కమిషన్ ఓఎంఆర్ పద్ధతిలో కాకుం డా సీబీఆర్టీ పద్ధతిలోనే పరీక్షను నిర్వ హించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. 44,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి వర్తింపచేసే నార్మలైజేషన్ ప్రక్రియను పాటించా లంటూ నిపుణుల కమిటీ సూచన మేరకు దాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అందుకు సంబంధించిన నమూనాను ప్రకటించామని పేర్కొన్నారు.