Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- జూన్ 1న రాతపరీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2023-25 బ్యాచ్ ప్రవేశాల కోసం డీసెట్-2023 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ ఎస్ శ్రీనివాసాచారి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు తుది గడువు వచ్చేనెల 22వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు అదేనెల 27 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశముందని వివరించారు. జూన్ ఒకటో తేదీన డీసెట్ రాతపరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అదేనెల ఎనిమిదో తేదీన ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. జూన్ 12వ తేదీ నుంచి ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. జులై ఐదో తేదీ వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో ఫీజు చెల్లింపు ఉంటుందని పేర్కొన్నారు. జులై 12వ తేదీన నిబంధనలు విడుదల చేస్తామని తెలిపారు. డైట్, ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రయివేటు విద్యాసంస్థలతోపాటు మైనార్టీ, మైనార్టీయేతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు చేపడతామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు http://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ను సంప్ర దించాలని కోరారు.