Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లిని కలిసిన జేఏసీ ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ జేఏసీ ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో కలిసారు. ఆ చట్టం మొదలైన నాటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దేశంలోనే మన రాష్ట్రం ఉపాధి హామీలో నెంబర్‌వన్‌గా నిలవడంలో ఉపాధి హామీ ఉద్యోగుల పాత్ర మరువలేని దన్నారు. తమకు పే స్కేల్ అమలు చేయించేలా సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలని కోరారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు అంజిరెడ్డి, గురుపాదం, నాగభూషణం, తదితరులు ఉన్నారు.