Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు డ్రైవర్ మృతి
- 12మందికి తీవ్రంగా గాయాలు
- ఈదురు గాలులకు విరిగిపడిన చెట్టు కొమ్మ వల్లే..
నవతెలంగాణ-వెల్గటూర్
ఈదురు గాలులకు చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై పడటంతో లారీ, మినీ బస్సు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతిచెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల పరిధిలోని కొత్తపేట వద్ద రాష్ట్ర రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్తికలను గోదావరిలో కలిపేందుకు మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బెజ్గాంకు చెందిన కుటుంబీకులు 30మంది మినీ బస్సు ప్రయివేట్ ట్రావెల్స్‌లో ధర్మపురికి వస్తున్నారు. అయితే, గురువారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై పడింది. ఆ కొమ్మను తప్పించబోయి బస్సు డ్రైవర్ కుడివైపుకు తిప్పడంతో అటు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢకొీన్నది. ఈ ప్రమాదంలో బస్సులలోని 12 మందికి తీవ్ర గాయలయ్యాయి. ఎస్ఐ నరేష్ ఘటనా స్థలానికి చేరుకొని వారిని బస్సులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ మృతిచెందాడు. ఉదయం ఆర్అండ్బి అధికారులు చెట్ల కొమ్మలు తొలగిం చకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.