Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యులర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలి
- మంత్రులు హరీశ్‌రావు, సబితకు టిప్స్, టీఎస్‌జీసీసీఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, రెగ్యులర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని కోరాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో టిప్స్ కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, టీఎస్‌జీసీసీఎల్‌ఏ అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియ గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఉత్తర్వులు వచ్చేటట్టు చూడాలని కోరారు. అదేవిధంగా గత ఐదేండ్లుగా రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల బదిలీల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బదిలీలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. ఈ అంశాల పట్ల మంత్రు లు సానుకూలంగా స్పందిం చారని తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కార మయ్యేలా కృషి చేస్తామన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జీసీసీఎల్‌ఏ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్, సైదులు, ముడి శేఖర్, సంగీత తదితరులు పాల్గొన్నారు.