Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీకేజీ కేసులో స్టేకు హైకోర్టు నో
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజరు దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర స్టే ఆదేశాల జారీకి హైకోర్టు నిరాక రించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కమలాపూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసింది. సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఆయన తరపు లాయర్ వినతిని కోర్టు తోసిపుచ్చింది. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. ప్రతివాదుల వాదనల తర్వాతే తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసు దర్యాప్తుపై స్టే విధించాలంటూ బండి వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారించారు. బండి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవి చందర్ వాదనలు వినిపించారు. సంజరుపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా, పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి పేపర్లు బయటకు వెళ్లకుండా ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోలేదని తెలిపారు. పిటిషనర్‌పై ఫిర్యాదు చేయడానికే ఆయన ఎంతో ఆసక్తిని కనబరిచారని చెప్పారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు కూడా జారీ చేయకుండా అరెస్టు చేయడం సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకమని తెలిపారు. ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటమేనని చెప్పారు. పభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ... బండి సంజరు ఈ కేసులో ఇతర నిందితులతో కలిసి కుట్ర చేశారని వాదించారు. ఆయన ఫోన్ నుంచి నిందితులకు వాట్సాప్ సందేశాలను పంపారని వివరించారు. బండి అరెస్టు తర్వాత ప్రశ్నపత్రాల లీకేజీ ఆగిపోయిందని గుర్తు చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీకేజీని ప్రేరేపించారని చెప్పారు.
ఇలాంటి వాటిని ప్రోత్సహించడం చట్ట ప్రకారం తీవ్ర నేరమని అన్నారు. ఇప్పటికీ బండి తన సెల్‌ఫోన్‌ను దర్యాప్తు నిమిత్తం పోలీసులకు ఇవ్వలేదని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు ఏ విధమైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న ఏజీ వాదనను హైకోర్టు ఆమోదించింది. ప్రతి వాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.
షర్మిల నిరాహారదీక్షకు అనుమతి...
పేపర్ లీకేజీలకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్ష చేసేందుకు వీలుగా వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్‌రెడ్డి అనుమ తినిచ్చారు. ఆమె చేపట్టబోయే నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. అయితే దీక్ష సందర్భంగా నిర్వహించే సభలో 500 కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదనీ, రెచ్చగొట్టేలా, కించపరిచేలా ప్రసంగాలు చేయకూడదని సూచిం చింది. 48 గంటల్లోగా సంబంధిత పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ షర్మిలకు షరతులు విధించారు. ఈనెల 17న దీక్ష చేసేందుకు దరఖాస్తు చేసుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన న్యాయమూర్తి పలు షరతులతో ఆమె నిరాహారదీక్షకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.