Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ అనుసరిస్తున్న తిరోగమన విధానాలే మహారాష్ట్ర వెనుకబాటుకు కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీది ప్రయివేటైజేషన్ అయితే, బీఆర్ఎస్ది నేషనలైజేషన్ పాలసీ అని తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీజేపీ విక్రయించిన సంస్థలన్నింటినీ తిరిగి ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మోడల్ అంటే 450 పథకాల రాజపత్రమని చెప్పారు. గుజరాత్ మోడల్ ఒక బూటకమనీ, ప్రధాని మోడీవి గోల్మాల్ మాటలని విమర్శించారు. 24న ఔరంగాబాద్‌లో నిర్వహించే సభ చరిత్ర సృష్టిస్తుందనీ, పార్టీలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని వెల్లడించారు.
బీఆర్ఎస్లో పటేల్ పార్టీ విలీనం
మహారాష్ట్ర ప్రదేశ్ సర్దార్ వల్లభ్ భారు పటేల్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని జీవన్ రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు శనివారం ఆయనతో ఆ పార్టీ అధ్యక్షులు బాబా సాహెబ్ షెల్కే, ఇతర కీలక నేతలు చర్చించి విలీన నిర్ణయాన్ని ప్రకటించారు.తెలంగాణ మోడల్‌ను మహారాష్ట్రలోనూ అమలు చేయాలంటే కేసీఆర్ నాయకత్వంలో పని చేయడమే ఉత్తమమనే ఉద్దేశంతోనే విలీనం నిర్ణయం తీసుకున్నట్టు షెల్కే తెలిపారు.