Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందుకున్న మంత్రి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుకి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. దుబారులో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)షోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆయన్ను ఆహ్వానించారు. జూన్ 7, 8వ తేదీల్లో దుబారులోని జుమేరా ఎమిరేట్స్ టవర్లో ఈ ప్రదర్శన జరగనుంది. మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వల్ల దానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు తమ ఆహ్వానంలో పేర్కొన్నారు. దుబాయిలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్యరంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులూ ఆ సమావేశంలో పాల్గొనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శిస్తారు. దుబారుకి అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించడంతోపాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధుల తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు. కేటీఆర్ హాజరు కావడమనేది దుబారులో ఉన్న భారతదేశ, ముఖ్యంగా తెలుగు ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.