Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళను కత్తితో బెదిరించి చోరీ చేసిన ఆటో డ్రైవర్
- వెంబడించి పట్టుకున్న భద్రతా సిబ్బంది
నవతెలంగాణ-నర్సాపూర్
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళను డ్రైవర్ కత్తితో బెదిరించి మెడలోని పుస్తెలతాడును చోరీ చేరి పరావుతుండగా.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌లో శనివారం జరిగింది. ఒంటరి మహిళను కత్తితో బెదిరించి దొంగతనానికి పాల్పడి పారిపోతున్న ఆటో డ్రైవర్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తన గన్మెన్లతో కలిసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలోని సంఘపేట గ్రామానికి చెందిన ఊరడి సురేష్ ఆటో నడుపుతాడు. శనివారం తన ఆటోలో తన భార్య స్వప్నతో కలిసి నర్సాపూర్ వస్తున్నాడు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ స్టేజ్ వద్ద అమృత అనే మహిళ నర్సాపూర్ వెళ్లేందుకు సురేష్ ఆటో ఎక్కింది. నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే సురేష్ ఆటోను పక్కకు ఆపాడు. తన ఆటోలో ఉన్న అమృతను కత్తితో బెదిరించాడు. చంపుతానంటూ భయపెట్టి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును తెంపుకుని ఆమెను వదిలేసి పరారయ్యాడు. అమృత గట్టిగా అరుస్తుండటంతో అదే సమయంలో ఆ దారిలో ప్రయాణిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి చూశారు. కాన్వారు ఆపి అమృతను ఏం జరిగిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతో చైర్పర్సన్ తన భద్రతా సిబ్బందికి చెప్పి పారిపోతున్న ఆటో డ్రైవర్ సురేష్‌ను పట్టుకోవాలని సూచించారు. భద్రతా సిబ్బంది వెంబడించి సురేష్‌ను పట్టుకున్నారు. జరిగిన సంఘటన గురించి స్థానిక పోలీసులకు పోన్ చేసి సమాచారం ఇచ్చారు. చోరీకి పాల్పడిన సురేష్‌తో పాటు అతని భార్య స్వప్నను పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. వెంటనే ఎస్ఐ శివకుమార్ సురేష్ నుంచి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.