Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ తన సామాజిక సమానత్వ దార్శనికత ద్వారా దేశ విదేశాల్లోని మేధావులు, సీనియర్ రాజకీయ వేత్తల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యుకేలోని సౌతాల్ ఈలింగ్ నుంచి ఎంపీగా గెలిచిన బ్రిటీష్, ఇండియన్ సంతతికి చెందిన 76 ఏండ్ల సీనియర్ రాజకీయ నేత వీరేంద్ర శర్మ శనివారం ఈమేరకు ఈమెయిల్ ద్వారా సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు.
'అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించడం గొప్ప విషయం. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఆయన పుట్టుక, చేసిన కృషి ఆయన చరిత్రే భారత దేశం గురించి వివరిస్తుంది. నాటి పరిస్థితుల్లో అంబేద్కర్ ప్రదర్శించిన సహనం, సమానత్వం కోసం చేసిన కృషి, పట్టుదల, ఆలోచనలు, కార్యాచరణ, విరామమెరుగని వారి రచనావ్యాసంగం మహౌన్నతమైనవి. కాలం చెల్లిన సాంప్రదాయ మూసధోరణులను పక్కకు తోసి, ఎలాంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాలను, సమానత్వంతో కూడిన సమ్మిళితాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. బహుళత్వం దిశగా సమాజాన్ని నడిపించేందుకు వారి ఆలోచనలకు రూపమిచ్చి నవీన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, పితామహుడుగా భారత దేశ పురోగమనానికి నాందిపలికారు. భవిష్యత్తు తరాల కోసం ఆయన దార్శనికతను మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. మూఢవిశ్వాసాలకు తావులేకుండా, భారత ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు' అని తన లేఖలో పేర్కొన్నారు.