Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ రైల్వే, సిమెంట్ పరిశ్రమ కంపెనీల
- జాతీయ స్థాయి సమావేశంలో అధికారుల భరోసా
- హాజరైన రైల్వే అధికారులు, సిమెంట్ కంపెనీల ప్రతినిధులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి, రవాణకు చేయూతనందిస్తామని రైల్వేబోర్డు, దక్షిణమధ్య రైల్వే అధికారులు భరోసా కల్పించారు. సిమెంట్ తయారీదారుల సంఘం ఆధ్వర్యంలో భారతీయ రైల్వే అధికారులు, సిమెంట్ పరిశ్రమ ప్రతినిధుల ఉమ్మడి జాతీయ స్థాయి సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హౌటల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా సిమెంట్ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలు, సిమెంట్ పరిశ్రమ భవిష్యత్తులో మరింత వద్ధి సాధించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిమెంట్ రవాణాకు సహాయపడే విధానపరమైన, లాజిస్టిక్‌లను మెరుగుపరచడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే 144 మిలియన్ టన్నుల సిమెంట్, క్లింకర్ లోడింగ్‌ను నమోదు చేసింది. సిమెంట్ రవాణాలో అగ్రగామి జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే, 2021-22లో 34.108 మిలియన్ టన్నులతో పోల్చితే 2022-23లో 34.499 మిలియన్ టన్నుల సిమెంట్ లోడింగ్‌ను సాధించింది. దక్షిణ మధ్య రైల్వే సిమెంట్, క్లింకర్‌లో జోన్ గతంలో సాధించిన లోడింగ్ కంటే ఇదే అత్యుత్తమ లోడింగ్ ఇదే.
భారతీయ రైల్వేలు, దక్షిణ మధ్య రైల్వేతో సహా సిమెంట్ రవాణాను మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో వివిధ టారిఫ్, నాన్-టారిఫ్ వంటి చర్యలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్‌ను బలోపేతం చేయడమే కాకుండా లోడింగ్ పాయింట్లను తెరవడానికి కూడా జోనల్, డివిజనల్ స్థాయిల్లో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, రైల్వేల ద్వారా సిమెంట్ లోడింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు పరిశ్రమల యాజమాన్యాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా నిర్ణయించిన సమావేశం మరో ముఖ్యమైన అడుగు అని చెప్పొచ్చు. సిమెంట్ తయారీదారుల సంఘం ఆ రంగం వద్ధి, మొత్తం లాజిస్టిక్స్ సంబంధిత అంశాలు వివిధ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యాలలో వద్ధి, సిమెంట్ పరిశ్రమకు వ్యూహాత్మక భాగస్వామిగా రైల్వేల పాత్ర సమీప భవిష్యత్తులో అంచనా వేయాల్సిన వాల్యూమ్లకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీనికి సంబంధించి విధానపరమైన సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. రైల్వే బోర్డు, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ అధికారులు అభివద్ధి చెందుతున్న సిమెంట్ రంగానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వారు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా వివరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్‌కుమార్ శ్రీవాస్తవ, న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు నుంచి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమలేష్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. వీరితో పాటు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ రవీన్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ బి.నాగ్య, రైల్వే బోర్డుపాటు దక్షిణ మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే, కాంకర్ అధికారుల బందం, సిమెంట్ పరిశ్రమల నుంచి అల్ట్రాటెక్, వాసవదత్తా, మైహౌమ్, భారతి, పెన్నా, దాల్మియా, ఓరియంట్, జిందాల్ మొదలైన వివిధ సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.