Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చరిత్ర, సైన్స్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దాడి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) విమర్శిం చింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి జీవ పరిణామ క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలను తొలగించటం సరైంది కాదని తెలిపారు. చరిత్ర నుంచి మొఘలుల చరిత్ర, గాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు తదితర పాఠ్యాంశాలను తొలగించటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్య చరిత్ర, సైన్స్‌పై మత శక్తుల దాడి అని విమర్శించారు. నూతన విద్యా విధానం పేరుతో భారతీయ సమాజంపై కేంద్ర ప్రభుత్వ ధ్వంస రచన ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత శాస్త్ర సాంకేతిక విద్యాసంస్థలకు చెందిన 1,800 మంది సైన్స్ అధ్యా పకులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు ఎన్సీఈఆర్టీ చర్యలను తప్పుపడుతూ ఆ సంస్థ డైరెక్టర్‌కు లేఖలు రాశారని గుర్తు చేశారు. అభ్యుదయ, ప్రజా స్వామి కవాదులు, సైన్స్ ప్రేమికులందరూ ఈ చర్యలను తీవ్రంగా ప్రతిఘటించాల ని కోరారు. కేంద్రం, ఎన్సీఈఆర్టీ తక్షణమే ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.