Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను సామాన్య ప్రజలు వినియోగించుకోవటానికి వీలుగా రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పలుమార్లు ఈ అంశంపై వారిని కలిసి సమస్యను విన్నవించినట్టు పేర్కొన్నారు. 'జాతీయ భద్రత, ప్రజలకు సౌలభ్యం అనే రెండు సున్నితమైన అంశాల విషయంలో అన్ని పక్షాలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన సందర్భంలో.. కంటోన్మెంట్ ప్రాంతానికి నీరు, విద్యుత్ సరఫరా నిలిపేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బెదిరింపులు.. తదితర అంశాలను కూడా తెలియజేశానని కిషన్ రెడ్డి వెల్లడించారు.