Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊరికో బస్ ఆఫీసర్ నియామకం..! :ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల వద్దకు మరింతగా తీసుకెళ్లేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు పల్లెల్లో బస్ ఆఫీసర్లను నియమిం చాలని నిర్ణయించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూ.. ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థకు రూప కల్పన చేసింది.ఆయా ఆఫీసర్ల నియామకం, విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను సంస్థ వీసీ సజ్జన్నార్ జారీ చేశారు. బస్ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆఫీసర్ల వ్యవస్థ మే ఒకటో తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ 10వేల గ్రామాలకు బస్సులు నడిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో 2వేలకుపైగా వీలేజ్ బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రజలు ఆదరిస్తున్నారనీ, అదే రకంగా విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను వినియో గించుకుని, సంస్థను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్, ీ సజ్జన్నార్ కోరారు.
మార్గదర్శకాలు..
గ్రామాల్లో నివసించే కండక్లర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లుగా డిపో మేనేజర్లు నియమిస్తారు. నియామకాల్లో ప్రజల స్నేహపూర్వకం గా సంబంధాలుండి, స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకొచ్చే వచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పెద్ద గ్రామాలకు ఒకరిని, చిన్న పల్లెలైతే రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకరిని ఆఫీసర్‌గా నియమించ నున్నారు.
మార్గదర్శకాల మేరకు ఒక్కొక్కరికి ఐదు గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు వీలుండదు. హైదరాబాద్ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను నియమించనున్నారు. వారు కూడా విలేజ్ బస్ ఆఫీసర్ల మాదిరిగానే పని చేస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయా అధికారు లు 15 రోజులకోసారి గ్రామంలోని ప్రజలతో సమావేశ వుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరించి, ఉన్నతాధికారులకు అందిస్తారు.
గ్రామాల్లో పెండ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా డే సమయాల్లో అందుకు తగినట్టుగా బస్ ట్రిప్పులను పెంచుతారు. వివాహది శుభకార్యాలకు ఆర్టీసీ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని కోరనున్నారు. ప్రయివేటు వాహనాల్లో వెళ్తే జరిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులను బస్ ఆఫీసర్లు సంప్రదించి, వారి సెల్ ఫోన్ నంబర్లను అధికారులకు అందజేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు టీఎస్ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు.
ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో సంబంధిత విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను స్థానిక డిపో మేనేజర్ పొందుపరుస్తారు. బస్ ఆఫీసర్ పేరు, ఫోన్ నంబర్ ఉంటుంది.
గ్రామానికి వచ్చే బస్సులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, రాయితీ పథకాలతో పాటు పెండ్లిండ్లు, శుభకార్యాలకు బస్సుల కోసం విలేజ్ ఆఫీసర్‌ను సంప్రదించేలా వివరాలను ప్రదర్శిస్తారు. ప్రతి గ్రామ సర్పంచ్‌కు ఆ ఆఫీసర్ వివరాలను లేఖ రూపంలో తెలియజేస్తారు. ఇదే సమయంలో మంచిగా పని చేసే విలేజ్ బస్ ఆఫీసర్లను ప్రోత్సహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి మంచి పనితీరు కనబరిచిన వారిని 'బెస్ట్ విలేజ్ బస్ ఆఫీసర్' అవార్డుతో సంత్కరించనున్నది. ఈ విధానంతో అందరూ మెరుగ్గా పని చేసే అవకాశం ఉండదనున్నది.