Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ సవాల్‌పై ఈటల స్పందన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేం దర్ స్పష్టం చేశారు. రేవంత్ విషయంలో తగిన సమయంలో జవాబిస్తానని
వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. శనివారం శామీర్ పేటలోని తన నివాసంలో రేవంత్ విసిరిన సవాల్‌పై ఈటల స్పందించారు. వ్యక్తిగతంగా తాను ఎవరినీ కించపరచలేదని చెప్పారు. తనకు కూడా ఆత్మవిశ్వాసం ఉందని.. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని చెప్పారు.