Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షార్‌లో అంబరాన్నంటిన సంబురాలు
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నుంచి పీఎస్ఎల్వీ -సీ55 రాకెట్ ప్రయోగం ఘన విజయం సాధించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఇస్రో పీఎస్ఎల్వీ -సీ55 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన టెల్ ఇయోస్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. 741 కిలోల బరువు కలిగిన సింగపూర్ ఉపగ్రహంతో పాటు 16 కిలోల లుమొలైట్ అనే ఉపగ్రహాన్ని అనుకున్న సమయానికి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇస్రో శాస్త్రవేత్తల, ఉద్యోగస్తుల కృషి ఫలితమే ఈ విసయమని ఇస్రో చైర్మెన్ సోమనాథ్ అన్నారు. కొంచెం క్లిష్టమైన ప్రయోగమైనా దీనిని ఉపగ్రహాలతో పాటు ఏడు పేలోడ్స్‌ని కూడా పంపామన్నారు. భవిష్యత్తులో కీలక ప్రయోగాలు చేపడతామన్నారు. అలాగే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతామన్నారు. ఈ సారి ప్రయోగించిన రాకెట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల వ్యయం తగ్గిందన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో విదేశాల నుంచి భారీ డిమాండ్ వస్తుందని తెలిపారు. అంతరిక్ష సేవల కోసం ప్రయివేటు సంస్థలు ముందుకు వస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఎన్నో మార్పులు వస్తాయని తెలిపారు. దేశీయ నావిగేషన్ సేవలు త్వరలోనే అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రాకెట్ విజయవంతం అవడంతో షార్‌లో సంబురాలు అంబరాన్నంటాయి. ఇస్రో చైర్మన్‌తో పాటు షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్, బి.ఎన్ రామకష్ణ, డైరెక్టర్ ఐఎస్ టిఆర్ ఎసి నారాయణ, డైరెక్టర్ ఎల్పీఎస్సీ, రాధాకృష్ణన్, సీఎండీ ఎన్ఎస్ఐఎల్ ఎం శంకరం, డైరెక్టర్ యూఆర్ఎస్సీ ఎస్సార్ బీజు, మిషన్ డైరెక్టర్ ఉన్నికష్ణన్, డైరెక్టర్ విఎస్ఎస్సి తదితరులు పాల్గొన్నారు.