Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు.: సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలనీ, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మంజూరు చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.