Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్షా రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గడచిన 9 ఏండ్లలో తెలంగాణ కంటే మెరుగైన ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపాలని మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) కోరారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి అమిత్షా పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీలేదని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్ మంజూరు చేయలేదనీ, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హౌదా ఇవ్వలేదనీ, మెట్రో రెండో దశ, ఐఐఎం ఏర్పాటు చేయలేదంటూ రాసుకొచ్చారు. ఐఐఎస్ఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయాలు, మెడికల్, నర్సింగ్ కళాశాలలు రాష్ట్రానికి ఎన్నెన్ని ఇచ్చారో చెప్పాలంటూ ట్విట్టర్ ద్వారా నిలదీశారు.