Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి
- కూనంనేని సాంబశివరావుకు రవాణా రంగ కార్మికుల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రవాణా రంగంలో ఓలా, ఉబర్ కార్పొరేట్ సంస్థల కోట్లాది రూపాయల దోపిడీని ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ మోటార్ రవాణా రంగ కార్మిక సంఘాలు, తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బైరగోని రాజుగౌడ్ నేతత్వంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మఖ్డూం భవన్లో ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయనకు వినతి పత్రం అందజేశారు. ఓలా, ఉబర్ యాజమాన్యాలు ఒక డ్రైవర్ నుంచి ఒక ట్రిప్పైనా 30శాతం కమీషన్‌ను తీసుకుని డ్రైవర్ల రోజువారి సంపాదనను కొల్లగొడుతున్నాయనీ, మరోవైపు ప్రజలపై కూడా అధిక చార్జీలు వడ్డించి దోచుకుంటున్నారని తెలిపారు. ఓలా, ఉబర్ యాజమాన్యాలు చేస్తున్న అరాచకాల వల్ల 16 గంటలు డ్యూటీ చేసిన డ్రైవర్ మూడు పూటలా భోజనం చేయలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఉబర్ యాజమాన్యాల అధిక కమీషన్ వసూళ్లతో డ్రైవర్లు తీవ్రంగా నస్టపోతున్నారనీ, ఇల్లు కిరాయిలు చెల్లించలేక, ఫైనాన్స్ కట్టలేక, పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివించలేక తీవ్ర ఒత్తిడికి గురై డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఓలా, ఉబెర్ సమస్యలతోపాటు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుకూలంగా మీటర్ చార్జీలు పెంచాలని, గతంలో హైదరాబాద్ మహానగరంలో 20 వేల ఆటో పర్మిట్లు జారీచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలనీ, రవాణారంగా కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. నూతన మోటార్ రవాణా చట్టం 2019 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లాలని కూనంనేని సాంబశివరావును కోరారు. ఈ సందర్బంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎర్ర జండా నిరంతరం నిరుపేద ప్రజల పక్షాన, కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రవాణా రంగ కార్మికుల సమస్యలను తక్షణమే లేఖ ద్వారా ముఖ్యమంత్రి కెేసీఆర్ దష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, ఆటో సెక్టార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కష్ణయ్య, లారీ సెక్టార్ జాయింట్ సెక్రటరీ భరత్ ముదిరాజ్, నాయకులు వరకాల భాస్కర్రజక తదితరులు పాల్గొన్నారు.