Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. రోజుల తరబడి రైతులు తమ పంటను కుప్పలుగా పోసుకుని ఎప్పుడు కాంటా వేసి కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాగం హేమంతరావు, పశ్యపద్మ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షం వచ్చినప్పుడు పంటను రక్షించుకునేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైతులే టార్ఫాలిన్లు తెచ్చుకోవాలంటూ అధికారులు షరతులు పెడుతున్నారని విమర్శిం చారు. తేమ శాతం, బెరుకులు మట్టి పెల్లలు ఇతరత్రా కారణాలు చూపెడుతూ తూకం వేయడాన్ని ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను సంబంధిత ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నష్టాన్ని సర్వే చేసి పరిహారం ఇవ్వాలని కోరారు.