Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ టీఎఫ్ రాష్ట్ర శాఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి జీవ పరిణామ క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలను తొలగించడాన్ని, చరిత్ర నుంచి మొఘలుల చరిత్ర, గాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు తదితర పాఠ్యాంశాలను తొలగించడాన్ని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాడి రాజన్న, మేడి చరణ్‌దాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చరిత్ర, సైన్స్‌పై మత శక్తుల దాడిగా పేర్కొంటూ నూతన విద్యా విధానం పేరిట భారతీయ సమాజంపై కేంద్ర ప్రభుత్వ ధ్వంస రచన ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత, శాస్త్ర, సాంకేతిక విద్యా సంస్థలకు చెందిన 1800 మంది సైన్స్ అధ్యాపకులు, ఉపాధ్యా యులు, శాస్త్రవేత్తలు ఎన్సీఈఆర్టీ చర్యలను తప్పుపడుతూ సంస్థ డైరెక్టర్‌కు లేఖలు రాశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీఈఆర్టీ తక్షణమే తమ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.